టూరిస్ట్ బస్సు – డీసీఎం వ్యాన్ ఢీ.. నుజ్జునుజ్జయిన క్యాబిన్లు
డీసీఎం డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం.. పలువురికి గాయాలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని కోదాడ క్రాస్ రోడ్డులో, ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.టూరిస్ట్ బస్సు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం డీసీఎం డ్రైవర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మృతి కూడా అత్యంత ఘోరంగా జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. డ్రైవర్ మూడు ముక్కలైనట్లు సమాచారం. అలాగే బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండగా, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి