కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి
పేదలను విద్యకు దూరం చేయడమే పాలకుల లక్ష్యం.... కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు బండి రమేష్
ప్రజాపక్షం /ఖమ్మం రూరల్: దళితులు క్రైస్తవ్యం స్వీకరిస్తే ఎస్సీ హోదా రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ అన్నారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో కేవీపీఎస్ పాలేరు డివిజన్ కమిటీ సమావేశం డివిజన్ అధ్యక్షులు పగిడికత్తులు నాగేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ... దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే రాజ్యాంగపరమైన హక్కులైన ఎస్సీ హోదా రద్దు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి దళితుల అస్తిత్వంపై దాడి చేసిందన్నారు.ఎస్సీ హోదా రద్దు చేయడమంటే దళితుల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15,16, 25 లను అభాసు పాలు చేయడమేనన్నారు.దళితులు ఏ మతంలోకి వెళ్లిన వారి రిజర్వేషన్ వారికే ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు బండి రమేష్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేల పాఠశాలలుగా కుదించే ప్రయత్నం వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించి మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థులు,తల్లితండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూడరన్నారు.ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దళిత కాలనీలో,తండాల్లో బ్లీచింగ్ చల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.దళిత వాడల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి సమస్యలను ఎప్పటికప్పుడు సంఘం నాయకులకు,అధికారులకు తెలియజేసి పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలని సూచించారు.అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కేవీపీఎస్ పాలేరు డివిజన్ కార్యదర్శి కొమ్ము శ్రీనివాస్,డివిజన్ ఇంచార్జ్ పాపిట్ల సత్యనారాయణ,డివిజన్ ఉపాధ్యక్షుడు పగిడిపల్లి వెంకట్రావు,నాయకులు వెలుతురు పుల్లారావు,వెలుతురు రామనాథం,ఏపూరి వరకుమార్,కొత్త ఉపేందర్,మునిగంటి యాదగిరి,జువాజీ అచ్చయ్య, వెంకటనారాయణ,సునీల్,రాయల సుందరయ్య,పప్పుల చందర్,రాము,పగిడి కత్తుల నవీన్,అరేంపుల చంద్రపాల్,వేణు, సాయి,సాగర్,తుమాటి వంశీ,చంటి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి