ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తరుణి హాట్ వద్ద కోతుల బీభత్సం.. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ప్రజలు





నిర్మాణ కార్మికుడిపై దాడి.. మరో వ్యక్తిని వెంటాడిన కోతుల గుంపు

అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల విజ్ఞప్తి

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. రహదారులపై నడిచే పాదచారులే లక్ష్యంగా కోతులు దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు ప్రాణభయంతో సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరుణి హాట్ పరిసర ప్రాంతం కోతుల ఆవాసంగా మారిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం ఉదయం తరుణి హాట్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ భవనంలో పనికి వెళ్తున్న నిర్మాణ కార్మికుడు శ్రీను అనే వ్యక్తిపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసి తీవ్రంగా కరిచింది. స్థానికులు అప్రమత్తమై అతడిని రక్షించగా గాయపడిన శ్రీనును చికిత్సకు తరలించారు.ఈ ఘటన మరువకముందే సమీపంలోని స్త్రీ టీ కేఫ్ వద్ద టీ తాగుతున్న మరో వ్యక్తిపై కూడా కోతులు దూసుకెళ్లాయి. దీంతో అతడు ప్రాణభయంతో రోడ్డుపైకి పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ రెండు ఘటనలతో అక్కడి ప్రజలు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.తరుణి హాట్ గోడలు, చెట్లపై గుంపులుగా సంచరిస్తున్న కోతులు తరచూ పాదచారులపై దాడి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఈ మార్గంలో వెళ్లేందుకు సైతం భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత కొంతకాలంగా కోతుల సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ శాశ్వత పరిష్కార చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా స్పందించి కోతులను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم