ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

రైతు బావిలో పడి ఆంబోతు మృతి.. గ్రామంలో చర్చనీయాంశం


 

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఎం, వెంకటాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని ఓ రైతుకు చెందిన బావిలో పడి ఓ ఆంబోతు (గిత్త) శనివారం మృతి చెందింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.గ్రామస్థుల కథనం ప్రకారం, ఈ ఆంబోతు గత కొంతకాలంగా సమీపంలోని ఆరెకోడు గ్రామంలో సంచరిస్తూ కనిపించేదని తెలిపారు. అయితే ఇది ఏ గ్రామానికి చెందినది? యజమాని ఎవరు? అనే విషయాలు ఇప్పటికీ తెలియరాలేదు. బావిలో పడిన విషయం ఎవరూ గుర్తించకపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు భావిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది