కాపా మురళీకృష్ణ వైరా మున్సిపాలిటీ ప్రజాప్రతినిధి నా?*
ప్రజాపక్షం/ వైరా: వైరా మున్సిపాలిటీ కార్యాలయం నందు మరియు మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలపై డాక్టర్ కాపా మురళీకృష్ణ గారికి ఏమీ సంబంధం ఏమిటి అని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ బుధవారం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా కట్ల సంతోష్ వినతిపత్రంలోడాక్టర్ కాపా మురళీకృష్ణ మున్సిపాలిటీకి సంబంధించి ప్రజా ప్రతినిధి కానప్పటికీ ప్రతిరోజు చైర్ పర్సన్ గారి రూమ్ నందు మేడమ్ గారి కుర్చీ పక్కన కుర్చీ వేసుకొని గంటల కొద్ది కుర్చోటానికి ఏవిధమైన హక్కు ఉంది, మున్సిపాలిటీ సంబంధించి అన్ని కార్యక్రమాలపై వారి పర్యవేక్షణ మరియు మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడానికి వారికి ఏమి హక్కు కలదు, మున్సిపాలిటీలోని అన్ని రంగాల కార్మికులకు ఆదేశాలు జారీ చేయుటకు మరియు సిబ్బంది విధీ నిర్వాహణలో వారికి ఏమి హక్కు కలదు., అధికారులతో కలిసి వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లోవార్డుల కార్యక్రమాల్లో వారి జోక్యంకు వారికి ఏమి హక్కు కలదు, మున్సిపాలిటీకి సంబంధించి మీరు ప్రతి విషయంలో వారి కనుసన్నల్లో వారి ఆదేశానుసారం పనిచేయుటకు వారికి ఏమి హక్కు కలదు.వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో వైరా మున్సిపాలిటీ నందు మరియు మున్సిపాలిటీ కార్యక్రమాలపై డాక్టర్ కాపా మురళీకృష్ణ పెత్తనం తగ్గించాలని ఒకవేళ మళ్ళీ ఇదే పరిస్థితి కొనసాగితే మేము పై అధికారులకు కంప్లైంట్ చేస్తానని దీనిపై నాకు లీఖిత పూర్వకంగా నాకు వివరణ కావాలని మున్సిపల్ కమిషనర్ ను వైస్ చైర్మన్ కట్ల సంతోష్ కోరారు
.

కామెంట్‌ను పోస్ట్ చేయండి