ఇండియా బిషప్ రమేష్ బాలన్
పాల్గొన్న 5 రాష్ట్రాల బిషప్,తెలంగాణ బిషప్
ప్రజాపక్షం/నేలకొండపల్లి: ఎస్ క్యూ ఐ సంస్థ దేశంలోని క్రైస్తవ పాస్టర్ల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇండియా బిషప్ రమేష్ బాలన్ అన్నారు. ముదిగొండ మండల కేంద్రంలోని బేతేస్థ చర్చిలో బుధవారం ఎస్ క్యూ ఐ సంస్థ ద్వారా బిషప్.ఎస్. సుందర్ పాల్,బిషప్.వి. డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో ముదిగొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాస్టర్స్ అందరికీ విలువైన అభిషేకములు,మ్యారేజ్ లైసెన్స్ సర్టిఫికెట్,రెవరెండ్ సర్టిఫికేట్ లు ఆయన అందించి ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల బిషప్ ప్రకాశం,తెలంగాణ బిషప్ జె జె సామ్యూల్ సన్ లు పాల్గొని పాస్టర్లకు ఎస్ క్యూ ఐ సంస్థ ద్వారా జరిగే భవిష్యత్ కార్యక్రమాలు, పాస్టర్ల సంక్షేమ వివరాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్లు పి. జె సామ్యూల్,బిషప్ మధన్,బిషప్ ధనశేఖర్, బిషప్ అరుల్,బిషప్ ఎన్. యోబు,అబ్రహం పాల్,ఎం ఆండ్రస్,బి దినకరన్,బి నాగేశ్వరరావు,ఐ మార్క్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి