మద్దులపల్లి రెవెన్యూలో క్వారీపై అనుమానాలు
అక్రమ తవ్వకాలతో ప్రకృతి సంపదకు నష్టం.. ప్రభుత్వ ఆదాయానికి గండి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న ఓ క్వారీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాళికామాత ఆలయం సమీపంలోనే ప్రకృతి సంపదను వెలికితీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తవ్వకాలకు సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా..? లేక నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయా..? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఖనిజ సంపదను వెలికితీస్తే ప్రభుత్వ రాయల్టీ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపద పరిరక్షణతో పాటు అక్రమ తవ్వకాలపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి