ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి... గ్రామపంచాయతీల ద్వారానే ఇండ్లు కేటాయించాలి


  కాచిరాజు గూడెం గ్రామ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేసిన సర్పంచ్, సిపిఎం నాయకులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్, సిపిఎం పార్టీ నాయకులు శనివారం నిరసన చేపట్టారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీతకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకుడు పొన్నం వెంకటరమణ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులను గ్రామ పంచాయతీ పాలకవర్గాల ద్వారానే పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాలకే బాధ్యతలు అప్పగించాలని కోరారు.అధికార పార్టీ నాయకులు తమ అనుచరులకు లబ్ధి చేకూర్చేలా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనపెట్టి రాజ్యాంగేతర వ్యక్తుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూడటం తగదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి అర్హులైన పేదలకే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలను సమీకరించి మరిన్ని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలోత్ హరి, పార్టీ నాయకులు పొన్నం మురళి, షైక్ సైదులు, ధర్మపురి నాగబ్రహ్మాచారి, కొనకటి సుధాకర్ రెడ్డి, అద్దంకి లాలు, జిల్లెల్ల వెంకటేశ్వర్లు, షైక్ దావుద్ మియా, జిల్లెల్ల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم