విద్యను బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్న పూర్వ విద్యార్థులు
ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలో 1993–94 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మూడు దశాబ్దాల అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మారెమ్మ తల్లి సన్నిధానంలోని ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులు వేణుగోపాల్, వి.వి. రామారావులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కిరణ్, యాదగిరి, చారి, శివప్రసాద్, బి. శ్రీను, నాగ శ్రీను, నారపాటి రవికుమార్, ఎర్ర ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొని పాత అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి