ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పార్లమెంట్ వద్ద ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి నిరసన గళం


 నీట్ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల అవకతవకల అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి ఇండియా కూటమి ఎంపీలతో కలిసి పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద నిరసన చేపట్టారు.నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్న ఎంపీలు, నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత స్వీకరించి వెంటనే రాజీనామా చేయాలని రఘురాం రెడ్డి డిమాండ్ చేశారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విధంగా పరీక్షల నిర్వహణ జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నీట్ పరీక్షల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో పార్లమెంట్ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది