కమల్ బాదంపాలు షాపు ప్రారంభించిన సీపీఐ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత ఆర్థికంగా ఎదగాలని సీపీఐ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కమల్ బాదంపాలు షాపును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి దుకాణాన్ని ప్రారంభించిన దండి రంగారావు, షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. కృషి, నాణ్యమైన సేవలు, వినియోగదారుల విశ్వాసమే వ్యాపార విజయానికి పునాదులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.


إرسال تعليق