ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఎస్ఐఆర్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం మానుకోవాలి


  బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్:ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గోబెల్స్ ప్రచారం మానుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పోలింగ్ బూత్ నెం.127లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు... ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు.ఈ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్లో అనవసర అపోహలు సృష్టిస్తూ దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థగా నిష్పాక్షికంగా విధులు నిర్వహిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘంపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే గోబెల్స్ ప్రచారానికి స్వస్తి పలకాలన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సర్ కన్వీనర్ భుక్యా శ్యాంసుందర్, బి జె వై ఎమ్ ఏ జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, మండల అధ్యక్షుడు జాటోత్ మధు నాయక్, మున్సిపాలిటీ నాయకులు బానియా నాయక్, సాగర్, సత్తి, నాగరాజు, సురేష్, హీరోలాల్, కొమరబత్తిని వెంకన్న, కొత్త ఉపేందర్రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم