ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు పనులు వద్దంటూ రైతుల ఆందోళన.. ఉద్రిక్తత


 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: న్యాయస్థానం నుంచి తుది తీర్పు వెలువడే వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టవద్దంటూ సాగు రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం కామంచికల్– దారేడు గ్రామాల మధ్య ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పోలీసు బందోబస్తుతో సర్వే చేపట్టేందుకు బుధవారం ఫీల్డ్‌కు చేరుకోగా, బాధిత రైతులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.దీంతో కొద్దిసేపు రైతులు, అధికారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలే తాము ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, ఈ నెల 28న తుది తీర్పు వెలువడనున్నందున అప్పటి వరకు ఎలాంటి సర్వేలు, రహదారి పనులు చేపట్టరాదని రైతులు స్పష్టం చేశారు.న్యాయస్థానం తీర్పును గౌరవించి అనంతరం మాత్రమే పనులు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, అధికారులు పరిస్థితిని సమీక్షించి వెనుదిరిగినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది