ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

తీర్దాల సంగమేశ్వరుని దేవస్థానంలో టెండర్–కమ్–బహిరంగ వేలం ప్రకటన


 ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామంలోని సంగమేశ్వరుని దేవస్థానం పరిధిలో పులిహోర ప్రసాదం విక్రయ హక్కును టెండర్–కమ్–బహిరంగ వేలం ద్వారా కేటాయించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహక అధికారి (ఈవో) ప్రకటించారు.దేవస్థానం ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు ఒక సంవత్సరం కాలానికి ఈ హక్కును కేటాయించనున్నారు. ఇందుకు కనీస డిపాజిట్ రూ.25,000గా నిర్ణయించారు. టెండర్ దరఖాస్తులను జూలై 20 నుంచి 21 వరకు కార్యాలయంలో పొందవచ్చని, జూలై 22 ఉదయం 10 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అదే రోజు ఉదయం 11 గంటలకు దేవస్థాన కార్యాలయంలో టెండర్లు తెరిచి, అనంతరం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.టెండర్‌లో పాల్గొనే వారు నిర్ణయించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఎంపికైన కాంట్రాక్టర్ నిర్ణీత గడువులో ఒప్పంద ప్రక్రియ పూర్తి చేసి, దేవస్థాన నిబంధనల మేరకు ప్రసాదాల విక్రయం నిర్వహించాల్సి ఉంటుందని ఈవో స్పష్టం చేశారు.ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు దేవస్థాన కార్యాలయాన్ని లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంప్రదింపు నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది