ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ...



 28వ వార్డు సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు

ఘనంగా అప్పారావు ప్రాథమిక చికిత్స కేంద్రం ప్రారంభం

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: అప్పారావు ప్రాథమిక చికిత్స కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలు అందించాలని 28వ వార్డు సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు అన్నారు. ఈ మేరకు గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన చికిత్స కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి పేద కుటుంబానికి సకాలంలో వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమన్నారు. ప్రజలు దేవుడి తర్వాత వైద్యులనే నమ్ముతారని, దేవుడు జన్మనిస్తే వైద్యులు తమ సేవలతో ప్రాణాలను కాపాడి పునర్జన్మ ప్రసాదిస్తారని పేర్కొన్నారు.అందుకే వైద్య వృత్తిని సేవాభావంతో కొనసాగిస్తూ, పేదలకు నాణ్యమైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం ద్వారా 28వ వార్డు ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత చేరువవుతాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది