మంత్రి పొంగులేటి అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన BRS, CPM నేతలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామంలో ఈరోజు రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రెవిన్యూ, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై BRS, CPM పార్టీలకు చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో బుధవారం చేరారు.మంత్రి క్యాంపు కార్యాలయం ఇంచార్జి శ్రీ తుంబూరి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం చేతుల మీదుగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా BRS పార్టీ నుంచి మాజీ వార్డు సభ్యుడు యనిగండ్ల రాంబాబు, CPM పార్టీ నుంచి యువ నాయకుడు పేరిల్లి మధు కాంగ్రెస్లో చేరారు. మంత్రి పొంగులేటి నాయకత్వంలో ప్రజా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలివేరు బాబు, గునిగంటి సురేష్, గునిగంటి రమేష్, ఉప్పుగండ్ల ప్రసాద్, ఆరెంపుల సునీత రామారావు, కుసుమ రాజా, గన్నోజు గోవిందమ్మ, ఆరెంపుల రవి, బుర్ర రాజేష్, పీఎస్ఆర్ సోషల్ మీడియా వారియర్ బద్రిసాయి తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق