ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నెల రోజుల వ్యవధిలోనే నలుగురు మృతి


 మరణాలు యాదృచ్ఛికమే... కానీ వరుస విషాదాలు 

ఒకరి మరణం మరువకముందే మరో కుటుంబంలో మృత్యుఘంటిక

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28, 31 వార్డుల్లో గత నెల రోజులుగా చోటుచేసుకున్న వరుస మరణాలు స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. వైద్యపరంగా చూస్తే ఇవన్నీ అనారోగ్య కారణాలతో జరిగిన మరణాలే. కానీ ఒకరి మరణం జరిగిన రెండో రోజే మరో వ్యక్తి కన్నుమూయడం ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తోంది.31వ వార్డులో మేళ్లచెరువు ముత్తమ్మ మృతి చెందిన రెండు రోజుకే అదే ప్రాంతానికి చెందిన నారపాటి దాసు కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ విషాదం నుంచి కుటుంబాలు, స్థానికులు ఇంకా తేరుకోకముందే తాజాగా 28వ వార్డులో రంగిశెట్టి వైదిక మృతి చెందిన రెండో రోజే అదే వార్డుకు చెందిన షేక్ మైబల్లి అనే యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. నెల రోజుల వ్యవధిలో నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడం, వరుసగా అంత్యక్రియలు జరగడం ఆ రెండు వార్డుల ప్రజలను భావోద్వేగానికి గురిచేస్తోంది. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ... "ఇంత తక్కువ సమయంలో ఇన్ని విషాదాలా?" అన్న ప్రశ్న వినిపిస్తోంది.ఈ మరణాలన్నీ అనారోగ్య సమస్యల కారణంగానే జరిగినప్పటికీ, ప్రజలు ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటనలు మరోసారి గుర్తుచేస్తున్నాయి. చిన్న ఆరోగ్య సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదిస్తే ఇలాంటి విషాదాలను కొంతవరకు నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది