ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కస్నా తండాలో మళ్లీ దొంగల బీభత్సం


 వైర్లు ఏర్పాటు చేసిన రైతులకే మరోసారి షాక్

కేసు నమోదైనా వెనక్కి తగ్గని వైర్ల దొంగలు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని కస్నా తండాలో వైర్ల దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. జులై 23న జరిగిన భారీ వైర్ల దొంగతనం ఘటన నుంచి రైతులు ఇంకా కోలుకోకముందే అదే తరహాలో మంగళవారం అర్ధరాత్రి మరోసారి చోరీ జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.గత ఘటనలో ఆరుగురు రైతులు విద్యుత్ మీటర్లకు బిగించిన సుమారు రూ.72 వేల విలువైన విద్యుత్ వైర్లను దొంగలు అపహరించగా, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటికీ దొంగలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా మళ్లీ అదే ప్రాంతంలో చోరీలకు పాల్పడడం గమనార్హం.తాజాగా వైర్లు కూలిపోయిన నలుగురు రైతులు కొత్తగా ఏర్పాటు చేసుకున్న విద్యుత్ వైర్లను దుండగులు అపహరించుకెళ్లారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో కస్నా తండా రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వైర్ల దొంగలను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది