ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

పేపర్ లీకేజీలపై గర్జించిన పౌర సమాజం


 వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా భారీ నిరసన ర్యాలీ 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

-కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక నిలిచిన ప్రొటెస్ట్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల పేపర్ లీకేజీలతో పాటు నీ పేపర్ లీకేజీ పై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రొఫెసర్, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఏదులాపురం మున్సిపాలిటీలో ప్రత్యామ్నాయ పౌర సమాజం (CCA) ఆధ్వర్యంలో ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తొలుత చౌరస్తాలోని ఓ సమూహంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు ప్రజాస్వామ్యం పై జరుగుతున్న దాడిపై క్లుప్తంగా సందేశాన్ని ఇచ్చారు. వరుస పేపర్ లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలపై పోరాడుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావాలని, నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమైన ఈ నిరసన స్ఫూర్తిగా నిలిచి, రాష్ట్రం మరియు దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రజా ఉద్యమాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ ర్యాలీ ఇక్కడ నుంచి నాయుడుపేట తీగల వంతెన వరకు సాగిన ర్యాలీలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్), బీఆర్‌ఎస్, ఈటీపిడబ్ల్యూఏతో పాటు వివిధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, యూనియన్ల ప్రతినిధులతో విజయవంతంగా సాగింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పేపర్ లీకేజీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది