సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం
ప్రజాపక్షం/వైరా:వైరా మున్సిపాలిటీకి రూ.53.82 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు కావడం, గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు చేరడం, ఆశీర్వాద సభ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శనివారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఏదునూరు సీతారాములు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ప్రభుత్వం వైరా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ నిధులు మంజూరు చేయడం, గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు తీసుకురావడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ హెల్త్ అండ్ మెడికల్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ పణితి సైదులు, పమ్మి అశోక్, ఉండ్రు శ్యాంబాబు, పాలేటి నరసింహారావు, వేముల రత్నాకర్, వీరంశెట్టి సీతారాములు, తోటకూర శ్రీకాంత్, కంభంపాటి సత్యనారాయణ, తేలూరు వీరయ్య, పెద్దప్రోలు లక్ష్మయ్య, కన్నెగంటి నగేష్, ఏదునూరి శ్రీను, బత్తుల శ్రీను, బిక్యా, దురిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق