సరిగ్గా యాభై ఏళ్ల క్రితం తెలంగాణ విప్లవ కవి చెరబండ రాజు ఇలా పిలుపునిచ్చాడు—
"యువతరమా… నవతరమా… ఇదే అదును కదలిరమ్ము… ఈ దేశానికి కళ్లూ నీవే… కాళ్లూ నీవే…"
ఆ పిలుపు నేటికీ సజీవంగానే ఉంది. ఈ దేశ భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచించింది యువతే. మార్పు కోసం ముందుకు వచ్చింది యువతే. ఆ మార్పును అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దేశద్రోహులనే ముద్రలు వేశారు. మతోన్మాదులని, పరమత శక్తులని దుష్ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు నిజాన్ని నమ్మారు. మీ పోరాటాన్ని విశ్వసించారు.
మీ ఉద్యమం తొలి డిమాండ్ నెరవేరిందంటే అది ప్రజా ఐక్యతకు, యువశక్తికి నిదర్శనం. కానీ ఈ విజయంతోనే ఉద్యమం ఆగిపోవద్దు. ఒక్క రాజీనామాతో పోరాటం ముగియదు. సమాజ మార్పు కోసం, సమాన అవకాశాల కోసం, నాణ్యమైన విద్య కోసం, ఉపాధి–ఉద్యోగాల కోసం మీ గొంతు మరింత బలంగా వినిపించాలి.
కట్టు, బొట్టు, కులం, మతం కడుపు నింపవు. యువతకు కావాల్సింది గౌరవప్రదమైన జీవితం, విద్య, ఉద్యోగం, సమాన హక్కులు. ఆ లక్ష్యాల కోసం చైతన్యాన్ని రగిలించండి. ప్రజలను ఏకం చేయండి.
- ఏనుగు వెంకటేశ్వరరావు, ప్రజాపక్షం ఖమ్మం జిల్లా, ఉమ్మడి బ్యూరో

إرسال تعليق