ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

శ్రీరామ్ నగర్‌లో కలకలం.. పాత రైస్ మిల్ ప్రాంతంలో కొండచిలువ సంచారం

రహదారిపై కొండచిలువ


ప్రజాపక్షం/ఖమ్మం రూరల్:ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీలోని పాత రైస్ మిల్ ప్రాంతంలో సోమవారం రాత్రి కొండచిలువ సంచరించడం స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది. ప్రధాన రహదారిని దాటుతూ వెళ్తున్న కొండచిలువను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో స్థానికంగా వైరల్ కావడంతో కాలనీవాసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.కొండచిలువను ప్రత్యక్షంగా గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం వేగంగా వ్యాపించడంతో చిన్నారులు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కాలనీవాసులు ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. దీంతో కొంతసేపు ఆ ప్రాంతంలో భయాందోళనల వాతావరణం నెలకొంది.పాత రైస్ మిల్ పరిసరాల్లో పొదలు పెరగడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వల్లే ఇలాంటి వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడంతో పాటు పొదలను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది