ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సిపిఐ సభ్యురాలు ముత్తమ్మ మృతి మృతి



 నివాళులర్పించిన భాగం హేమంతరావు దండి సురేష్

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31 వ వార్డుకు చెందిన మేళ్లచెరువు ముత్తమ్మ(50) అనారోగ్యంతో సోమవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్ర జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో వారి పెద్ద కుమార్తె మేళ్లచెరువు లలిత ఎంపీపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం సిపిఐ అనుబంధ సంఘమైన మహిళా సమాఖ్య మండల కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్, వెంపటి సురేందర్, మండల సమితి సభ్యులు మెడకంటి పెద్ద వెంకటరెడ్డి, వెన్నం భాస్కర్, మామిడి సుదర్శన్ రెడ్డి, మేళ్లచెరువు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది