ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి



విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆరోపణ

సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన స్థానికులు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం ఆరంపుల పంచాయతీ పరిధిలోని గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరంపుల గ్రామానికి చెందిన మేడా రవీందర్ అనే ప్రైవేట్ ఎలక్ట్రిషన్ విద్యుత్ స్తంభంపై మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అయిన రవీందర్‌ను విద్యుత్ శాఖ అధికారులు పనుల కోసం తీసుకువచ్చారని, సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రమాదం జరిగిన అనంతరం బాధితుడిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని కూడా స్థానికులు ఆరోపించారు.ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గ్రానైట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు . ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم