ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని గుర్రాలపాడు, గోళ్ళపాడు, ముత్తగూడెం, వాల్యా తండా గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ నీటి కుంటల (ఫామ్ పాండ్లు) నిర్మాణంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గోళ్ళపాడులో జరిగిన కార్యక్రమానికి కూసుమంచి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మిట్టపల్లి సతీష్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటల సాగును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. అధిక నీటి అవసరం ఉండే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల పెసర, కంది, జొన్న, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు నష్టాలను నివారించవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే దిగుబడులు మెరుగుపడటంతో పాటు రైతుల ఆదాయం కూడా స్థిరంగా ఉంటుందని వివరించారు.అలాగే, వీబీజీ రంజీ పథకం ద్వారా రైతులకు 100 శాతం రాయితీతో వ్యవసాయ నీటి కుంటలు (ఫామ్ పాండ్లు) నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కుంటలు 20×20×3 మీటర్లు, 12×12×2.5 మీటర్లు, 8×8×2.5 మీటర్ల పరిమాణాల్లో నిర్మించబడతాయని చెప్పారు. వర్షాకాలంలో కురిసే నీటిని నిల్వ చేసి అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల మట్టం పెరగడం, రక్షణాత్మక నీటిపారుదల, కరువు పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పెరగడం, చేపల పెంపకం వంటి అనుబంధ కార్యక్రమాలకు కూడా ఈ కుంటలు ఉపయోగపడతాయని వివరించారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు నిర్మించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జె. ఉమా నగేష్, ఏదులాపురం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ బుర్ర మహేష్, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భద్రకాళి, మల్లారెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు ఆదర్శ్, కావ్య, వంశీ, నజ్మా కౌసర్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق