ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

సిద్ధినేని హేమలత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కూనంనేని


 చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి

ప్రజాపక్షం / ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామానికి చెందిన సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు సిద్ధినేని కర్ణకుమార్ తల్లి సిద్ధినేని హేమలత ఇటీవల మృతి చెందారు. ఆ సమయంలో వ్యక్తిగత, పార్టీ కార్యక్రమాల కారణంగా పరామర్శకు హాజరుకాలేకపోయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం వారి నివాసానికి  వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి సీపీఐ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి,పార్టీ తరఫున అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సిపిఐ గ్రామ మాజీ సర్పంచ్ బండి ఉపేందర్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి బండి సాయి, సహాయ కార్యదర్శి దాసరి పున్నయ్య, గ్రామ నాయకులు గోగినపల్లి రామ్మూర్తి, సిద్దినేని బోసు, కర్ణం ఉపేందర్, పొడేటి అంజయ్య, భాస్కర్, హేమంత్, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم