ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కాంగ్రెస్‌ 1,000 రోజుల పాలనలో విఫలం



 ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఆర్‌జేసీ కృష్ణా 

ప్రజాపక్షం/ వైరా: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి బీఆర్‌ఎస్‌ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీఆర్‌ఎస్‌ వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌జేసీ కృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం వైరా పట్టణంలోని మిట్టపల్లి గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆర్ జె సి కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని కృష్ణ విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి కంటే దోపిడీనే కనిపిస్తోందని ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చూపించాలని అన్నారు. సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్‌ 1,000 రోజుల పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నియోజకవర్గవ్యాప్తంగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 2 వైరా నియోజకవర్గ కేంద్రంలో ధర్నా, బహిరంగ కార్డుల పంపిణీ, 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన. సెప్టెంబర్‌ 3: కొనిజర్లలో వ్యవసాయం, సాగునీరు, యూరియా, రైతు బీమా అంశాలపై రైతు సదస్సు. సెప్టెంబర్‌ 4: మహిళలకు రూ.2,500, కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మి, విద్యార్థులకు స్కూటీల హామీల అమలుపై కారేపల్లిలో వంటావార్పు. సెప్టెంబర్‌ 5: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, జాబ్‌ క్యాలెండర్‌, యూత్‌ డిక్లరేషన్‌ తదితర అంశాలపై విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ. సెప్టెంబర్‌ 6: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు. సెప్టెంబర్‌ 7: అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమంలో 420 హామీలపై వినతిపత్రాల సమర్పణ. సెప్టెంబర్‌ 8: అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కృష్ణ పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బానోత్‌ చంద్రావతి, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వరరావు, వనమా విశ్వేశ్వరరావు, లకావత్‌ గిరిబాబు, భానోత్‌ మనీషా లక్ష్మి, ముత్యాల సత్యనారాయణ, పోట్ల శ్రీనివాసరావు, సక్కుబాయి, ముత్యాల వెంకట అప్పారావు, కౌన్సిలర్ చిలక కోటయ్య, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, కొత్త వెంకటేశ్వరరావు,మద్దెల రవి, అప్పం సురేష్‌, లాల్‌ అహ్మద్‌, కామినేని శ్రీనివాసరావు, ఏదునూరి శ్రీను, గుజ్జర్లపూడి దేవరాజు,మరికంటి శివ, పాముల వెంకటేశ్వర్లు, అయినాల కనకరత్నం,విలాసాగరం నరేష్,తిరుపతి శ్రీను, భాను, సక్కుబాయి, వజినేపల్లి చక్రవర్తి, మిట్టపల్లి సత్యబాబు, వాసిరెడ్డి శంకర్రావు, దామా లిఖిత్‌, చౌదరి, మాటేటి కిరణ్‌, చల్లా మోహన్‌రావు, ఆదూరి ప్రేమ్‌కుమార్‌, పారుపల్లి నాగం, కారుకొండ బోస్‌, కందుల ఓంకార్‌, వాసంగలపాటి శివ, వాంకుడోత్‌ జగన్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది