ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ఢిల్లీ బయలుదేరిన ఎదులాపురం మున్సిపాలిటీ సీపీఐ నాయకులు


 జంతర్‌మంతర్‌లో జరిగే సీపీఐ జాతీయ కమిటీ ధర్నాకు హాజరు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: “బదలావ్ జరూరీ హై.. మార్పు కావాలి” అనే నినాదంతో ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు కేంద్రంగా ప్రారంభమైన సీపీఐ యాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగి ఖమ్మంలో ముగిసిన విషయం తెలిసిందే.ఈ యాత్రలో భాగంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీపీఐ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీపీఐ నాయకులు సోమవారం తెల్లవారుజామున ఢిల్లీకి బయలుదేరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆధ్వర్యంలో ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలి వెళ్లారు. ఈ బృందంలో ఎదులాపురం మున్సిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు, 30వ వార్డు కౌన్సిలర్ దండి శ్రీజతో పాటు పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసేందుకు జంతర్‌మంతర్‌లో నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పాల్గొననున్నట్లు నాయకులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది