పరిశీలించిన చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ
ప్రజాపక్షం/వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. శుక్రవారంమున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ రోడ్డు పనులను పరిశీలించారు. డోజర్ సహాయంతో రోడ్డుపైపేరుకుపోయిన బురదను తొలగించి, అనంతరం రెడ్‌మిక్స్‌తో రోడ్డును చదును చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై బురద పేరుకుపోయిన విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులను ఆదేశించి మరమ్మతు పనులు చేపట్టినట్లు చెప్పారు. త్వరలోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాని
కి పెద్ద ఎత్తున నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ మెడికల్ అండ్ హెల్త్ అధ్యక్షులు డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్, ఉండ్రు శ్యాంబాబు, రేచర్ల నాగేశ్వరరావు, సాయి తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి