హర్షం వ్యక్తం చేసిన కళాశాల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని పోనెకల్లోని శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ (SCIT)కు ఇంటర్న్‌శాల ర్యాంకింగ్–2026లో జాతీయ స్థాయిలో 141వ ర్యాంక్, జోనల్ స్థాయిలో 63వ ర్యాంక్ లభించింది. దేశవ్యాప్తంగా 800కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పాల్గొన్న ఈ ర్యాంకింగ్‌లో కళాశాలకు ఈ ఘనత దక్కడం పట్ల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్మెంట్ అవకాశాల కల్పనలో కళాశాల చేస్తున్న కృషికి ఈ ర్యాంక్ నిదర్శనమన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. సాయి గీతిక మాట్లాడుతూ అధ్యాపకులు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగం, విద్యార్థుల సమిష్టి కృషితో ఈ విజయం సాధ్యమైందన్నారు. అలాగే ఈ సందర్భంగా కళాశాలలో పొందిన సర్టిఫికెట్‌ను డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య, ప్రిన్సిపాల్ డా. జె. లక్ష్మీనారాయణ డీన్ డా. వి. సుదర్శన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. రాజేష్, డిప్లొమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది విజయ చిహ్నంగా ఆవిష్కరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి