ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయండి


 ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఈనెల 23న సత్తుపల్లిలో నిర్వహించనున్న ఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలను కార్మికులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎదులాపురం, వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండా, ఖమ్మం రూరల్ ఎంపీడీఓ కార్యాలయం పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులతో వరుస సమావేశాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల పని పరిస్థితులు, కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, ఈపీఎఫ్, ఈఎస్ఐ, సంక్షేమ పథకాల అమలు, పెండింగ్ సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తోట రామాంజనేయులు మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం సంఘటిత ఉద్యమాలతోనే సాధ్యమవుతుందని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల సాధన, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. జిల్లా 17వ మహాసభలు కార్మిక ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించే కీలక వేదికగా నిలుస్తాయని పేర్కొన్న ఆయన, ప్రతి కార్మికుడు స్వచ్ఛందంగా పాల్గొని మహాసభలను చారిత్రాత్మక విజయంగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఆకిన పవన్, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ & ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర సమితి సభ్యురాలు బల్లి ఉపేంద్ర, జిల్లా నాయకులు ఆర్.నారాయణరెడ్డి, వీరన్న, హస్సన్, తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم