లబ్ధిదారులకు ప్రాధాన్యత.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17,426 సర్వీసులు గుర్తింపు
టీజీ రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.ఆజయ్ కూమార్.
ప్రజాపక్షం /నేలకొండపల్లి: ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 28 గ్రామాలను సోలార్ మోడల్ విలేజ్ లు గా ఎంపిక చేసినట్లు టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ పి.ఆజయ్ కూమార్ తెలిపారు. మండలం లోని చెరువుమాధారం మోడల్ సోలార్ విలేజ్ పధకం పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..ఉమ్మడి జిల్లాలో 28 గ్రామాలలో మొత్తం 17,426 సర్వీస్ లను గుర్తించినట్లు తెలిపారు. సోలార్ వెలుగులు ఏర్పాటు లో మొదట గా గృహా జ్యోతి లబ్దిదారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో 4,669 వ్యవసాయ కనెక్షన్ లు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ పధకం పనులు శర వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయం కు 7.5 కిలోవాట్ల సోలార్ పంపు సెట్స్, గృహాలకు 2. కిలో వాట్ల రూఫ్తప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పధకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో స్వచ్చమైన, పునరుత్పాదక విద్యుత్ ను ప్రోత్సాహించటంతో పాటు ప్రజలకు అదనపు విద్యుత్ ను గ్రిడ్ కు ఎగుమతి చేయటం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. లబ్దిదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా, ఇళ్ల పై 2 కిలో వాట్స్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయటానికి దాదాపు రూ.1.36 లక్షలు, వ్యవసాయ కనెక్షన్ లకు 7.5 కిలో వాట్ల సోలార్ పంపు సెట్ ఏర్పాటు కు రూ.4.95 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇంటి యాజమానులకు ఏడాదికి కనీసం రూ.20 వేల వరకు అదనపు ఆదాయం వస్తుందన్నారు. పధకం విద్యుత్ ఖర్చుల ను తగ్గించుకోవటం తో పాటు వినియోగం అనంతరం విద్యుత్ గ్రిడ్ కు ఎగుమతి చేసి అదనపు ఆదాయం పొందుతారని పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు కు ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు. అర్హులైన ప్రతీ కుటుంబం ఈ పథకం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి