ప్రతీ మోడల్ విలేజ్ కు రూ.100 కోట్లు ఖర్చు గిలిగింతలు పెట్టినా...
పొర్లుదండాలు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు.
సోలార్ ప్లాంట్స్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాసరెడ్డి.
ప్రజాపక్షం / నేలకొండపల్లి: ఆర్ధిక భారమైన సోలార్ వెలుగులు రాష్ట్ర వ్యాప్తంగా అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రెవిన్యూ, గృహా నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మండలం లోని చెరువుమాదారం లో బుధవారం సోలార్ ప్లాంట్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు....ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్...కాంగ్కెస్ అంటేనే కాంగ్రెస్ అన్నారు. ఆనాడు దివంగత సీఎం డాక్టర్.వైఎస్.రాజశేఖర్ రేడ్డి ఉచిత కరెంట్ ను అందించారని.. నేడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందిస్తుందన్నారు. ఫ్రీ కరెంట్ కాంగ్రెస్ పేటేంట్ అన్నారు. ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గం కు ఒక గ్రామం ను మోడల్ విలేజ్ గా తీసుకుని గృహా, వ్యవసాయ కనెక్షన్ లకు ఉచితంగా సోలార్ వెలుగులు అందించనున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామం కు దాదాపు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ పధకం ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వాడుకోవటంతో పాటు అదనపు ఆదాయం కోసం గ్రీడ్ కు సరఫరా చేయవచ్చునని పేర్కొన్నారు. ఎవరూ గిలిగింతలు పెట్టినా... పొర్లుదండాలు పెట్టినా... ప్రభుత్వం సంక్షేమ పధకాల అమలు లో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్., విద్యుత్ ఎస్.ఈ. శ్రీనివాసచారీ, మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, ఈవూరి శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ లు యల్లయ్య, బోయిన వేణు, కట్టెకోల నాగార్జున, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి