ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

‘మూడు చేపల కథ’కు భూక్యా సురేష్ నాయక్ క్లాప్


లఘు చిత్ర యూనిట్‌కు అభినందనలు.. మంచి అవకాశాలు రావాలని ఆకాంక్ష

ప్రజాపక్షం/ ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ‘మూడు చేపల కథ’ లఘు చిత్రం షూటింగ్‌ను హైదరాబాదులోని బోడుప్పల్ లో శనివారం క్లాప్ కొట్టి ప్రారంభించారు. హైదరాబాద్‌ మరియు పరిసర ప్రాంతాల్లో తెరకెక్కుతున్న ఈ లఘు చిత్రానికి అంబటి సిద్ధార్థ దర్శకత్వం వహిస్తుండగా, వెంకీ, కిరణ్, సిద్దు హీరోలుగా నటిస్తున్నారు. సాయి ఫణీంద్ర ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.ఈ సందర్భంగా భూక్యా సురేష్ నాయక్ చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. లఘు చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందాలని, ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ మంచి పేరు, గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు. ప్రతిభను నిరూపించుకునేలా మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది