ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

వరంగల్ క్రాస్ రోడ్డు.. డిసిసిబిలో ఆకర్షణీయ వడ్డీ రేట్లతో డిపాజిట్‌ పథకాలు...

రైతులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, వ్యాపారులకు రుణ సౌకర్యాలు..

రూ.75 లక్షల వరకు హౌసింగ్‌ లోన్‌

ప్రజాపక్షం/ఖమ్మంరూరల్: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్ లోని కర్ణగిరి బ్రాంచ్ లో ఖాతాదారులు, రైతులు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, వ్యాపారులు తదితరులకు అనుకూలంగా వివిధ ప్రత్యేక డిపాజిట్‌, రుణ పథకాలకు గాను పరిమిత కాలం పాటు అందిస్తున్న ఈ ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో డిపాజిట్లు, అవసరాలకు అనుగుణంగా రుణ సౌకర్యాలను పొందవచ్చని మేనేజర్  షేక్ శిరీన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1000 రోజుల ధనవర్షం డిపాజిట్‌ పథకంలో సాధారణ ఖాతాదారులకు 7.55 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీ అందించనున్నట్లు తెలిపారు. 500 రోజుల కనకవర్షం డిపాజిట్‌ పథకంలో సాధారణ ఖాతాదారులకు 7.45 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.95 శాతం వడ్డీ లభిస్తుంది. అదేవిధంగా 555 రోజుల కుబేర డిపాజిట్‌, ఏడాది ఆర్‌డీ, ఏడాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో పథకాన్ని బట్టి 7.10 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రుణాల విషయానికి వస్తే గోల్డ్‌ లోన్‌ ద్వారా గ్రాము బంగారానికి రూ.9,100 వరకు రుణం పొందే అవకాశం ఉంది. వ్యాపార అవసరాల కోసం సహకార చేయూత రుణం ద్వారా రూ.5 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల (SHG)కు రూ.1.50 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, గృహ నిర్మాణం, ఇంటి అవసరాల కోసం హౌసింగ్‌ లోన్‌ ద్వారా రూ.75 లక్షల వరకు రుణం అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా NAML రుణం ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.38 లక్షల వరకు, విద్యార్థులకు విద్యా రుణం రూ.38 లక్షల వరకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాల కోసం KML, KNAML రుణ పథకాల కింద అర్హత కలిగిన రైతులకు భూమి విస్తీర్ణాన్ని బట్టి రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యక్తిగత రుణం రూ.10 లక్షల వరకు అందుబాటులో ఉందని కరపత్రంలో వెల్లడించారు. డిపాజిట్లతో పాటు వివిధ రుణ పథకాలు, సులభమైన రుణ ప్రక్రియ, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, డిపాజిట్లపై రుణ సౌకర్యం వంటి ప్రయోజనాలను ఖాతాదారులు వినియోగించుకోవాలని బ సూచించారు. మరిన్ని వివరాల కోసం 8019593355, 8500467461 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది