ప్రజా పక్షం/వైరా: కాంగ్రెస్ నాయకుడు చెరుకూరి కిరణ్ జన్మదిన వేడుకలు శనివారం వైరాలో రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కేక్ కట్ చేసి కిరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరిత భవన్‌లో కిరణ్ మిత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కలిసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అలాగే 9వ వార్డులోని రాజశేఖర్‌నగర్, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేసి కిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజలకు, స్నేహితులకు ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తూ “నేనున్నాను” అనే భరోసా కల్పించే మంచి మనసున్న వ్యక్తి చెరుకూరి కిరణ్ అని కొనియాడారు. ఆయనకు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్నేహితులు, కార్మికులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చెరుకూరి కిరణ్ జన్మదిన వేడుకలు
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి