ప్రజాపక్షం /వైరా: వైరా మండలం ఖానాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు ITC-MSK వారి సహకారంతో ఆదర్శ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ భూక్యా బాలాజీ మాట్లాడుతూ స్వతంత్ర సంపాదించుకోవడం కొరకు అమరవీరుల పోరాటం వారి జీవిత త్యాగాలు విద్యార్ధులకు స్ఫూర్తి దాయకం గా నిలుస్తాయి విద్యార్థులు ఈ స్వతంత్ర భారతావనిలో స్వేచ్చగా బ్రతికేందుకు అవకాశం కల్పించిన వారికి ధన్యవాదములు తెలియపర్చడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శీలం విష్ణువర్ధనరెడ్డి స్కూల్ H.M కీలారీ శ్రీనివాసరావు, విద్యాకమిటి సభ్యులు, ఉపాధ్యాయులు, ఆదర్శ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉయ్యూరు రామకృష్ణ గారు, కమ్యూనిటీ ఆర్గనైజర్ తోట కేశవరావు, విద్యార్థులు మరియు గ్రామస్థులు పాల్గొనడం జరిగినది
అమరుల త్యాగం మరువలేనిది :సర్పంచ్ బాలాజీ
byThe News Desk
-
0

కామెంట్‌ను పోస్ట్ చేయండి