ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి


 ప్రజాపక్షం/బోనకల్ : ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామం సమీపంలో శుక్రవారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాలను తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెనుబల్లి మండలం బ్రాహ్మణకుంట గ్రామానికి చెందిన తేజావత్ రాము (40) తీవ్రంగా గాయపడ్డాడు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రామును బయటకు తీసి 108 అంబులెన్స్ సహాయంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాము మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ట్రాక్టర్ బోల్తా పడటానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم