ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాలను వెంటనే అమలు చేయాలి


 బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన.. ప్రజావాణిలో వినతిపత్రం

ప్రజా పక్షం/వైరా: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే, రైతు బీమా రెన్యువల్‌కు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైరా మండల పరిషత్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్టా కృష్ణార్జునరావు మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు రైతులకు భరోసా కల్పించే రైతు బీమా పథకాన్ని ఎలాంటి జాప్యం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరఫున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, బాణాల వెంకటేశ్వరరావు, లాల్ మహమ్మద్, పెరుమాళ్ల కృష్ణమూర్తి, సిరిపురం సర్పంచ్ శెట్టిపల్లి శ్రీనివాసరావు, మద్దెల రవి, అప్పం సురేష్, తిరుపతి శ్రీను, బట్ట భద్రయ్య, ఏదునూరి శ్రీను,అదురి ప్రేమ్, మరికంటి శివ, కట్టా నాగేశ్వరరావు, తడికమల్ల నాగేశ్వరరావు, వజినేపల్లి చక్రవర్తి, దొంతెబోయిన చింతయ్య, కందుల ఓంకార్,దానయ్య, సింగవరపు నరేష్,విలసాగరం నరేష్ ,విశ్వనాథం, ఏలూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది