ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

"రైతు పక్షపాత పార్టీ కాంగ్రెస్‌: దాసరి దానియేలు


 సాగునీటి సమస్యపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌

ప్రజా పక్షం/వైరా: కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలిచే రైతు పక్షపాత పార్టీ అని రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు దాసరి దానియేలు అన్నారు. వైరా మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సాగునీటి అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. గత పాలనలో రైతులు సాగునీటి కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కార్చడం సరికాదన్నారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని సూచించారు. వైరా రిజర్వాయర్‌ అభివృద్ధికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే చర్యలు ప్రారంభమయ్యాయని దానియేలు తెలిపారు. అప్పటి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రూ.65 కోట్లతో రిజర్వాయర్‌ ఇరువైపుల సైడ్‌వాల్స్‌ నిర్మాణంతో పాటు పూడికతీత పనులు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ రూ.45 కోట్లతో కుడి, ఎడమ కాలువల అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైరా నియోజకవర్గంలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిందన్నారు. గోదావరి జలాలను రాజీవ్‌ కెనాల్‌ ద్వారా వైరా రిజర్వాయర్‌కు అనుసంధానం చేసి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌గా తీర్చిదిద్దే చర్యలు చేపట్టామని వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రోజులపాటు నీటి విడుదలను నియంత్రించాల్సి వచ్చిందని, అయితే వైరా రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి సాగునీరు అందేలా చర్యలు చేపట్టారని దానియేలు తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ఎమ్మెల్యే పూర్తి బాధ్యత తీసుకున్నారని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.గత పాలనలో ప్రతి సంవత్సరం సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు ఉండేవని, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళికతో రైతులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు రైతుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు.ఈ సమావేశంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోళ్ల గంగారావు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శీలం చంద్రశేఖర్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వీరంశెట్టి సీతారాములు, జిల్లా జనరల్‌ సెక్రటరీ దొడ్డ పుల్లయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బిడికి రత్నం, మాజీ ఎంపీటీసీ మచ్చ వెంకటేశ్వరరావు (బుజ్జి), సర్పంచులు మేడూరి రామారావు, పడకమళ్ల నాగార్జున, కారుమంచి యేసు, వెంకటేశ్వరరావు, మంచాల జయరాజు, షేక్‌ సైదా, అహ్మద్‌ పాషా, జి.రామకృష్ణ, శీలం మాధవరెడ్డి, కే.దావీదు, నరసింహారావు, ఎం.వెంకటసాయి, కే.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది