ప్రజాపక్షం / నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో టైర్ బండి తగిలి యువ రైతు మృతి చెందిన ఘటన మండలం లో చోటు చేసుకుంది. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని అమ్మగూడెం గ్రామానికి చెందిన వాసంశెట్టి అఖిల్ (34) అనే యువ రైతు మంగళవారం రాత్రి నేలకొండపల్లి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండుగా... అమ్మగూడెం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ సమీపం కు రాగానే చెరుకు సరఫరా చేసే టైర్ బండి యాంగ్లర్ తగిలింది. దీంతో రోడ్డు పై పడటంతో తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు గమనించి 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ హస్పిటల్ కు తీసుకెళ్తుండుగా..మార్గమధ్యలో గోకినేపల్లి సమీపం లోకి వెళ్లగానే మృతి చెందాడు. మృతుడు కు భార్య, ఇరువురు కూమార్తెలు "ఉన్నారు. వారిలో ఏడాది పాప తో పాటు ఐదేళ్ల కుమార్తె ఉన్నారు.గ్రామంలో తనకున్న ఎకరంన్నర వ్యవసాయం తో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక ఫ్యాక్టరీలో సీజనల్ లో కార్మికుడు గా విధులు నిర్వహించేవారని సమాచారం. మృతుడు గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు రోధిస్తున్న తీరు వర్ణాతీతం.

إرسال تعليق