ప్రజాపక్షం / ఖమ్మం: రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న భూభారతి (FTS) కంప్యూటర్ ఆపరేటర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. గత తొమ్మిది సంవత్సరాలుగా రెవెన్యూ శాఖలో సేవలు అందిస్తున్న తమను యథావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఉద్యోగులు కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ భూభారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 636 మంది భూభారతి ఎఫ్టీఎస్ ఉద్యోగులను యథావిధిగా రెన్యువల్ చేసి కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే 304 మంది ఉద్యోగులను తగ్గించే ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.ఇంకా 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగుల వివరాలను IFMIS పోర్టల్‌లో నమోదు చేయాలని, ప్రతి నెల 1వ తేదీన సకాలంలో వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి