యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: గోపి
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డుకు చెందిన సీపీఐ సోషల్ మీడియా ఇంచార్జ్ రెబ్బగొండ్ల గోపి అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఖమ్మం నగరంలోని గిరిప్రసాద్ భవన్‌లో శనివారం జరిగిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయనను నూతనంగా జిల్లా సమితి సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెబ్బగొండ్ల గోపి మాట్లాడుతూ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. యువత హక్కుల సాధన కోసం ఏఐవైఎఫ్‌ను మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యుడిగా బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి గోపి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎన్నికపై పలువురు సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి