ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

జూనియర్లపై సీనియర్ విద్యార్థి కొడవలితో దాడి


 జూనియర్ల ఫిర్యాదుతో కేసు నమోదు

ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థి కొడవలితో దాడి చేసిన ఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. పొన్నెకల్లు గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా చదువుతున్న షేక్ అజూమ్ ఈ నెల 18న కళాశాల ముగించుకుని తన స్నేహితుడు షేక్ రెహాన్‌తో కలిసి ఇంటికి వెళ్తుండగా సాయంత్రం 4.30 గంటల సమయంలో సీనియర్ విద్యార్థి కార్తీక్ వారిని అడ్డుకున్నాడు. అనంతరం తన వద్ద ఉన్న కొడవలితో అజూమ్‌పై దాడి చేయడంతో అతడి ఎడమ చేతి వేలు వద్ద తీవ్ర గాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ ముష్కరాజు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది