ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

డిప్యూటీ సీఎం చేతుల మీదుగా.. ఎలక్షన్ డిటి రవీందర్, వసంతకు ప్రశంసా పత్రాలు



 ప్రజాపక్షం/ఖమ్మం రూరల్: SIR-2026 ఎన్నికల విధుల్లో అంకితభావంతో, సమర్థవంతంగా విధులు నిర్వహించి విశిష్ట ప్రతిభ కనబరిచిన ఎలక్షన్ డిటి తుమ్మ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ కే. వసంత్‌లకు ఘన గుర్తింపు లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా వారు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. పాలేరు నియోజకవర్గంలో SIR-2026 ఎన్నికల విధుల్లో భాగంగా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినందుకు వారిని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసి ఈ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్నికల విధుల్లో చూపిన అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతాయుత పనితీరుకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా రవీందర్, వసంత్‌లను సహచర ఉద్యోగులు, అధికారులు అభినందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది