28వ వార్డు అభివృద్ధిలో మరో ముందడుగు
మంత్రి పొంగులేటి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి కౌన్సిలర్ కృతజ్ఞతలు
ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా శ్రీరామ్ నగర్లో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది. కాలనీవాసులతో కలిసి సిపిఐ కౌన్సిలర్ దండి రంగారావు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ డ్రైనేజీ నిర్మాణంతో కాలువ సమస్య పూర్తిగా తొలగి, మురుగునీటి ఇబ్బందులు తీరనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ దండి రంగారావు మాట్లాడుతూ, తన వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు పరిశుభ్రమైన, ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి సమస్యకు ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి