ప్రజాపక్షం/ఖమ్మం రూరల్ : జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం రూరల్ ప్రాజెక్టు పరిధిలోని అరేకోడు లోని అంగన్వాడీ కేంద్రం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని బారుగూడెం అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు జన్మించిన వెంటనే ముర్రుపాలు అందించడం, తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తి లభించి ఆరోగ్యవంతంగా ఎదుగుతారని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అంగన్వాడీ సూపర్వైజర్ మాలతి, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, నాగమణి, ఏఎన్ఎం ప్రభావతి, గ్రామ సర్పంచ్ రమాదేవి, ఉపసర్పంచ్ కొరివీరి, గ్రామపంచాయతీ కార్యదర్శి హనుమంతరావు, తల్లుల కమిటీ చైర్మన్ పల్లెర్ల అరుణ, వార్డు సభ్యులు, గ్రామదీపికలు, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి