ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

ప్రజల ప్రాణాలతో చెలగాటమా...?

 


రోడ్డుపైనే విద్యుత్ స్తంభాలు... అధికారులు ఎవరిని కాపాడుతున్నారు?

ప్రజల కోసమా... గుత్తేదారుల కోసమా ఈ ఏర్పాటు?

 కూసుమంచి మండలంలో విద్యుత్ శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు

ప్రజాపక్షం/కూసుమంచి: మండలం లోని, చేగమ్మ క్రాస్ రోడ్ నుండి చింతల తండా చర్చి వరకు ప్రధాన రహదారి వెంట కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ప్రధాన రహదారిని ఆనుకొని స్తంభాలను ఏర్పాటు చేయడంతో భారీ వాహనాల రాకపోకలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ గడ్డి లోడుతో వచ్చే ట్రాక్టర్లు, భారీ లారీలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను ఢీకొట్టే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు."ప్రజల భద్రత ముఖ్యమా... గుత్తేదారుల సౌలభ్యం ముఖ్యమా?" అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. రహదారి వెడల్పు, వాహనాల రాకపోకలు, భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని విమర్శిస్తున్నారు.ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ఇప్పుడే స్తంభాల స్థానాన్ని పరిశీలించి అవసరమైతే వాటిని సురక్షిత ప్రాంతానికి మార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు

 _ ప్రధాన రహదారి పక్కనే స్తంభాలు ఎందుకు ఏర్పాటు చేశారు?

- భద్రతా ప్రమాణాలు పాటించారా?

- భారీ వాహనాల రాకపోకలను పరిశీలించారా?

- ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?


"ప్రమాదం జరిగిన తర్వాత విచారణలు కాదు... ప్రమాదం జరగకుండా చర్యలే ప్రజలకు కావాలి" అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.

 మండల విద్యుత్ శాఖ అధికారి( ఏ.ఈ )ఎండి అబ్దుల్ ఖదీర్ వివరణ : రోడ్డు పక్కనే వేసిన స్తంభాలపై ప్రజాపక్షం విలేకరి వివరణ కోరగా ఈ సందర్భంగా ఈ మాట్లాడుతూ...

 రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు కొత్త లైన్ కోసము వేసాము ఇంకా తీగలు అమర్చలేదు ఆ క్రమంలో రోడ్డుకు దగ్గరగా ఉన్న స్తంభాలను అక్కడి నుండి తీసి  రోడ్డుకు దూరంగా వేస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది