ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

నాణ్యమైన నారుతోనే రైతులకు మేలు...


  వర్షాభావంలో మిరప సాగుపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజాపక్షం/వైరా: కల్తీ నారును అరికట్టి రైతులకు నాణ్యమైన నారును అందించేందుకు ప్రభుత్వం నర్సరీల నమోదుకు ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి ఎం.వి. మధుసూదన్ తెలిపారు. వైరా మండలం సోమవరం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన మిరప రైతులు, నర్సరీ యజమానుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎల్‌నీనో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున మిరప సాగుపై రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు. మిరప అధిక పెట్టుబడి, సుమారు ఏడు నెలలపాటు నిరంతర నీటి అవసరం ఉండే పంట కావడంతో నీటి లభ్యతను అంచనా వేసుకుని మాత్రమే సాగు చేపట్టాలని తెలిపారు. అవసరమైతే తక్కువ నీటి అవసరమయ్యే ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ వినియోగం, పంటల యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. నర్సరీ యజమానులు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నాణ్యతలేని నారు విక్రయిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వైరా డివిజన్ ఉద్యాన అధికారి డా. ఆకుల వేణు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైరా డివిజన్ ఉద్యాన అధికారి డా. ఆకుల వేణు, ఖమ్మం ఉద్యాన అధికారి జి. నగేష్, ఉద్యాన విస్తరణ అధికారి సత్యేంద్ర కుమార్, మిరప నర్సరీ యజమానులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post a Comment (0)

కొత్తది పాతది