ఈరోజు ముఖ్యాంశాలు

మరిన్ని తాజా వార్తల కోసం

మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

మధిర యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో షార్ట్ సర్క్యూట్


 ప్రజాపక్షం/మధిర: పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో బుధవారం షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. బ్యాంకు భవనం లోపల నుంచి కాలిన వాసన రావడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై అగ్నిమాపక శాఖ ఫైర్ ఆఫీసర్ బాలకృష్ణ విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

إرسال تعليق

Post a Comment (0)

أحدث أقدم